- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఏపీ అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారు
ఏపీ(Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) అసెంబ్లీ సమావేశాలకు ముహుర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చే నెల(ఆగస్టు) 18వ తేదీ నుంచి పది రోజుల వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం(AP Government) భావిస్తున్నట్లు సమాచారం. ఆగస్టులో అమలు చేయనున్న ప్రభుత్వ సంక్షేమ పథకాలపై ఈ అసెంబ్లీ సమావేశా(AP Assembly Meetings)ల్లో చర్చించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కొన్ని బిల్లులకు అసెంబ్లీ(Assembly)లో ఆమోదం తెలపనున్నారని సమాచారం. అలాగే, అమరావతి రాజధాని పై ప్రత్యేక చర్చ ఉంటుందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. సీఎం చంద్రబాబు రాష్ట్రంలో పెట్టుబడులే లక్ష్యంగా సింగపూర్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో సింగపూర్‌లో నాలుగు రోజుల పర్యటనను విజయవంతంగా పూర్తిచేసుకున్న సీఎం చంద్రబాబు ఏపీకి చేరుకుని ప్రభుత్వ పథకాల అమలు పై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు సమాచారం.






