Tiger Tension: టైగర్ టెన్షన్..! భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు

by Kema Shiva Kumar |

టైగర్ టెన్షన్ శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ప్రజలను వణికిస్తోంది.

Tiger Tension: టైగర్ టెన్షన్..! భయంతో వణికిపోతున్న ఆ జిల్లా వాసులు
X

దిశ, వెబ్‌డెస్క్: టైగర్ టెన్షన్ శ్రీకాకుళం జిల్లా (Srikakulam District) ప్రజలను వణికిస్తోంది. తాజాగా, మందస (Mandasa) మండల పరిధిలోని చీపి గ్రామంలో పెద్దపులి సంచరిస్తోంది. ఒడిశా (Odisha) బార్డర్‌ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించిన పులితో గ్రామస్థులు బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నారు. ఈ క్రమంలోనే స్థానికులంతా కలిసి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందజేశారు. ఈ మేరకు స్పాట్ వెళ్లిన అటవీ శాఖ అధికారులు భావనాపురం (Bhavanpuram) చెరువు దగ్గర పులి పాద ముద్రలను గుర్తించారు. అనంతరం అక్కడున్న పరిసర ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు.

రాత్రి వేళల్లో పొలాలకు కాపలాకు వెళ్లొద్దని సూచించారు. అదేవిధంగా ప్రత్తిపాడు మండల పరిధిలోని బాపన్నధార (Bhavannadhara) అటవీ ప్రాంతంలో పెద్ద పులి టెన్షన్ నెలకొంది. ఆవు దూడను వేటాడిన పులి పాద ముద్రలు అటవీ శాఖ అధికారుల ట్రాక్ చేశారు. అనంతరం అక్కడ ట్రాఫ్ కెమెరాలకు ఏర్పాటు చేసిన పులి కెమెరాకు చిక్కలేదు. దీంతో ఏజెన్సీ గ్రామాలన్నీ ఆందోళనలో ఉన్నాయి. పులి జాడ తెలిసేంత వరకు ధారపల్లి జలపాతం వద్దకు సందర్శకులు వెళ్లొద్దని అటవీ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

Next Story