- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సోదరులకు రాఖీ కట్టి.. ఆపై అచ్యుతాపురం ఫార్మాలో శవమై మిగిలే!
అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో. కాకినాడ కు చెందిన చల్లపల్లి హారిక (22) మృతి చెందారు.

X
దిశ, వెబ్ డెస్క్: అచ్యుతాపురం ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో కాకినాడ కు చెందిన చల్లపల్లి హారిక (22) మృతి చెందారు. తాపీ మేస్త్రిగా పనిచేసే హారిక తండ్రి ఐదేళ్ల క్రితమే చనిపోయారు. కెమికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన హారిక.. ఏడాది క్రితమే ఎసెన్షియాలో చేరి ఉద్యోగం చేస్తున్నారు. అయితే రాఖీ పండుగ సందర్భంగా సోదరులకు రాఖీ కట్టడానికి స్వస్థలం కాకినాడకు రాగా.. మరో రెండు రోజులు అక్కడే ఉండాలని సోదరులు చెప్పారు. కానీ ఎసెన్షియా యాజమాన్యం అనుమతి ఇవ్వకపోవడంతో నిన్న ఉదయమే ఆ ఫార్మా కంపెనీకి తిరిగి వెళ్లారు. కానీ అప్పటికే మృత్యువు వెంటాడంతో.. కంపెనీలో జరిగిన అగ్నిప్రమాదంలో హారిక తన ప్రాణాలు కోల్పోయింది. కాగా నిన్న ఏపీలోని అనకాపల్లి అచ్యుతాపురం సెజ్ కంపెనీలో, రియాక్టర్ పేలి పలువురు మరణించిన సంగతి తెల్సిందే.
Next Story






