Thunders: ఏపీలో ఉరుములతో కూడిన వర్షం

by Thanuru Gopichand |

ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురుస్తోంది.

Thunders: ఏపీలో ఉరుములతో కూడిన వర్షం
X

దిశ, డైనమిక్ ​బ్యూరో: ఏపీలోని పలు ప్రాంతాల్లో ఉరుములు, పిడుగులతో (Rains)కూడిన వర్షం కురుస్తోంది. నెల్లూరు జిల్లాలో భారీ ఈదురు గాలులతో పలుచోట్ల వర్షం కురుస్తోంది. కందుకూరు మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. బోగోలు, కావలి అల్లూరు లో మబ్బులు కమ్ముకున్నాయి. పెనుగాలులు వీస్తున్నాయి. నెల్లూరు జిల్లా బోగోలు కూడలిలో రోడ్డపై ఫ్లెక్సీలు పడిపోయాయి. ఇందుకూరు పేట మండలంలో ఉరుములు, మెరుపులతో వర్షం పడుతోంది. నెల్లూరు, విడవలూరులో ఈదురుగాలులు వీస్తున్నాయి. బుధవారం ఉత్తరాంధ్ర జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, పల్నాడు, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు. ఉరుములతో కూడిన వర్షం పడేపుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ కింద నిలబడరాదన్నారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Next Story