- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెల్ఫీ తెచ్చిన ముప్పు: జలపాతంలో పడి ముగ్గురు యువతుల దుర్మరణం
విహారయాత్రలో సరదాగా దిగాలనుకున్న సెల్ఫీ నలుగురు యువతుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ఏజెన్సీలో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు..

దిశ, వెబ్ డెస్క్: విహారయాత్ర(Excursion)లో సరదాగా దిగాలనుకున్న సెల్ఫీ(Selfy) నలుగురు యువతుల జీవితాల్లో తీరని విషాదాన్ని నింపింది. అల్లూరి సీతారామరాజు జిల్లా(Alluri Sitarama Raju District) పాడేరు ఏజెన్సీ(Paderu Agency)లో ప్రమాదవశాత్తూ జలపాతంలో పడి ముగ్గురు యువతులు మృతి చెందారు. మృతులను జంబవలస ప్రాంతానికి చెందిన త్రిష, పవిత్ర, రత్నకుమారిగా గుర్తించారు. నీటి ప్రవాహంలో గాలిస్తుండగా వీరి మృతదేహాలు లభ్యమయ్యాయి. కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా గడపడానికి వెళ్లిన వారు శవాలై తిరిగి రావడంతో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు అలముకున్నాయి.
మరో యువతి పరిస్థితి ప్రస్తుతం విషమం...
ప్రమాద సమయంలో వీరితో ఉన్న అంజలి అనే మరో యువతి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి ఆమెను కాపాడి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె అక్కడ అత్యవసర చికిత్స పొందుతోంది. లోతైన నీటి ప్రవాహం, జారుడుగా ఉన్న బండరాళ్లపై సెల్ఫీలు తీసుకునే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నా, ఇలాంటి ఘటనలు పునరావృతం కావడం పట్ల స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






