- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పుష్పగిరిలో విషాదం: పెన్నా నదిలో ముగ్గురు విద్యార్థుల గల్లంతు
కడప జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పుష్పగిరి వద్ద విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు నది ప్రవాహంలో గల్లంతయ్యారు. ..

దిశ, కడప: కడప జిల్లా పుష్పగిరిలో విషాదం చోటు చేసుకుంది. సరదాగా స్నానానికి వెళ్లిన ముగ్గురు యువకులు నది ప్రవాహంలో గల్లంతయ్యారు. వీరంతా కడప కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థులుగా గుర్తించారు. ఆదివారం కావడంతో కొంతమంది విద్యార్థులు పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నా నదిని సందర్శించారు. నదిలో స్నానం చేసేందుకు దిగిన సమయంలో నీటి లోతును సరిగ్గా అంచనా వేయలేక ముగ్గురు విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. విషయం తెలుసుకున్న వెంటనే వల్లూరు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. గజ ఈతగాళ్ల సహాయంతో గాలింపు చర్యలు చేపట్టారు.
గల్లంతైన వారిలో...
గల్లంతైన వారిలో ఒకరిని ఒడ్డుకు చేర్చిన పోలీసులు.. ప్రాణాలు కాపాడేందుకు సిపిఆర్ చేస్తూ తీవ్రంగా ప్రయత్నం చేశారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు.
గాలింపు చర్యలు ముమ్మరం
ప్రస్తుతం మరో ఇద్దరు విద్యార్థుల కోసం పోలీసులు, స్థానికులు కలిసి నదిలో ముమ్మరంగా గాలిస్తున్నారు. ఈ ఘటనతో విద్యార్థుల కుటుంబాల్లో, కళాశాలలో తీవ్ర విషాదం నెలకొంది.






