- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Liquor scam: మద్యం కేసులో.. మరో ముగ్గురు
ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది.

నిందితులుగా చేరుస్తూ సీఐడీ మెమో
ఏపీ లిక్కర్ స్కామ్ లో కీలక పరిణామం
ఇప్పటికే అరెస్టు అయిన నలుగురి రిమాండ్ పొడిగింపు
దిశ డైనమిక్ బ్యూరో: ఏపీ లిక్కర్ స్కాం కేసులో ఈరోజు మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసులో ఇప్పటికే నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్ (Remand)కు తరలించారు. కేసులో ముగ్గురు పేర్లను చేర్చుతూ విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. నిన్నటి వరకు అనుమానితులుగా ఉన్న ధనుంజయరెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, గోవిందప్ప.. నిందితులుగా మారారు. వారిని ఏ 31, ఏ 32, ఏ 33 గా పేర్కొన్నారు. ఏపీలో లిక్కర్‌స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. తాజాగా ఇప్పుడు నిందితులుగా చేరిన ముగ్గురు తమకు అరెస్టు నుంచి రక్షణ కల్పించాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. వారిని అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు సర్వోనత న్యాయస్థానం నిరాకరించింది. ఏపీ హైకోర్టులోనే ఈ కేసును తేల్చుకోవాలని స్పష్టం చేసింది. తమకు ముందస్తు బెయిలు కావాలని ధనుంజయ్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డితో పాటు గోవిందప్ప గతంలో పిటిషన్ దాఖలు చేశారు. ఈ లోగానే వారు మళ్లీ సుప్రీం కోర్టును ఆశ్రయించగా వారికి నిరాశే ఎదురైంది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు పేర్లను ఈ కేసులో చేర్చుతూ సీఐడీ మెమో దాఖలు చేసింది.
ఎప్పుడు ఎవరిని విచారణ చేస్తారో, ఎవరిని అరెస్టు చేస్తారో అన్నట్టులగా సీఐడీ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో కీలకమైన రాజ్‌కేసిరెడ్డి అరెస్టుతో లిక్కర్‌స్కాం డొంక కదిలింది. రిమాండ్‌లో ఉన్న అతనిని విచారణలోకి తీసుకుని మరిన్ని వివరాలను రాబట్టుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో ప్రమేయం ఉన్న వారిని అరెస్టు చేసేందుకు సిద్ధం అవుతోంది. ఇప్పుడు జగన్ ఓఎస్డీగా పనిచేసిన క్రిష్ణమోహన్ రెడ్డి, ఐఏఎస్ అధికారి ధనుంజయరెడ్డి, బాలాజీ గోవిందప్ప అరెస్ట్ తప్పదు అన్న చర్చ జరుగుతోంది. ఈ కేసులో ప్రస్తుతం అరెస్టు అయి రిమాండ్‌లో ఉన్న నలుగురు నిందితులకు ఏసీబీ కోర్టు (ACB Court)రిమాండ్ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించింది. మంగళవారంతో రిమాండ్ ముగియడంతో కేసులో మిగతా ఇద్దరు నిందితులు అయిన సజ్జల శ్రీధర్ రెడ్డి, పైలా దిలీప్‌లను మాత్రమే సిట్ అధికారులు కోర్టులో హాజరు పరిచారు. కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, చాణక్య కస్టడీలో ఉన్నట్లు కోర్టుకు అధికారులు తెలిపారు. దీంతో నలుగురు నిందితులకు రిమాండ్ పొడిగిస్తు ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.






