Breaking: విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-13 09:34:31  IST  )

విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి చెందారు...

Breaking: విజయవాడలో భారీ వర్షాలకు ముగ్గురు మృతి
X

దిశ, వెబ్ డెస్క్: విజయవాడ(Vijayawada)లో భారీగా వర్షాలు(Rains) కురుస్తున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు, మ్యాన్‌హోళ్లు పొంగిపొర్లుతున్నాయి. రోడ్లపై నీళ్లు నిలిచిపోయాయి. దీంతో ప్రమాదవశాత్తు ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మ్యాన్ హోల్ కోసం తవ్విన గుంతలో పడి ఓ వ్యక్తి మృతి చెందగా.. డ్రైనేజీలో పడి మరొకరు, చెట్టు కూలి ఇంకొకరు మృతి చెందారు. దీంతో వారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. నగర ప్రజలకు విజయవాడ కార్పొరేషన్ అధికారులు కీలక ప్రకటన విడుదల చేశారు. వర్షాలు పడుతున్న నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అత్యవసరమైతేనే ప్రజలు బయటకు రావాలని తెలిపారు.

Next Story