- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నకిలీ మద్యం కేసులో ముగ్గురికి బెయిల్
అన్నమయ్య జిల్లా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది....

X
దిశ, వెబ్ డెస్క్: ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు(Mulakalapalli fake liquor case)లో ముగ్గురు నిందితులు ఏ5 రాజేష్, ఏ19, అన్బురాసు, ఏ27 శ్రీనివాసరావుకు బెయిల్ మంజూరు అయింది. ఈ కేసులో ఇప్పటివరకూ 33 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 31 మందిని అరెస్ట్ చేశారు. 26 మందికి బెయిల్ మంజూరు అయింది. మరో ఇద్దరి అచూకీకోసం పోలీసులు గాలిస్తున్నారు. కాగా అన్నమయ్య జిల్లా(Annamaya District) ములకచెరువులో నకిలీ మద్యం తయారు చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసులో వైసీపీ నేతలు పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగి రమేశ్ ను సైతం అరెస్ట్ చేశారు. ఆయనకూ బెయిల్ మంజూరు మంజూరు కావడంతో జైలు నుంచి విడుదల అయ్యారు. ఇక ఇదే కేసులో తాజాగా మరో ముగ్గురు నిందితులను తంబళ్లపల్లి కోర్టు మంజూరు చేసింది.
Next Story






