‘ఇది ఎంతో మంది ఆకలి తీర్చేందుకు ఉపయోగపడుతుంది’: మంత్రి అచ్చెన్నాయుడు

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల(Tirumala) నిత్యాన్నదాన కార్యక్రమానికి విజయవాడ(Vijayawada) నుంచి ఏర్పాటు చేసిన కూరగాయల రథాన్ని జెండా ఊపి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ప్రారంభించారు.

‘ఇది ఎంతో మంది ఆకలి తీర్చేందుకు ఉపయోగపడుతుంది’: మంత్రి అచ్చెన్నాయుడు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని తిరుమల(Tirumala) నిత్యాన్నదాన కార్యక్రమానికి విజయవాడ(Vijayawada) నుంచి ఏర్పాటు చేసిన కూరగాయల రథాన్ని జెండా ఊపి రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు(Minister Atchannaidu) ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 2006 నుంచి ఈ కార్యక్రమం జరగడం చాలా సంతోషంగా ఉంది.

గత ఏడాది ఇదే కూరగాయల రథాన్ని ప్రారంభించడం మహానందంగా ఉందని మంత్రి తెలిపారు. ఎంతో మంది ఆకలి తీర్చేందుకు ఉపయోగపడే ఇలాంటి బృహత్తరమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అన్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కరుణ కటాక్షాలు ప్రతి ఒక్కరిపై ఉండాలని, ఆపదలో ఉన్న వారికి సాయమందించేలా మనందరికీ ఆ వెంకటేశ్వర స్వామి శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

Next Story