- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘గత ఎన్నికల్లో అందుకే ఓడిపోయాం’.. మాజీ సీఎం జగన్ సెన్సేషనల్ కామెంట్స్!
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే.

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో(Assembly Elections) ఎన్డీయే కూటమి ఘన విజయం సాధించి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ ఎన్నికల్లో వైసీపీ(YSRCP) కేవలం పదకొండు స్థానాలకే పరిమితమై ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఎన్నికల ఫలితాల(Election Results) అనంతరం వైసీపీ ఓటమికి గల కారణాల పై మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి(YS Jaganmohan Reddy) పలుమార్లు పార్టీ నేతలతో, కార్యకర్తలతో చర్చించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి మాజీ సీఎం జగన్ గత అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి గల కారణాల పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ(బుధవారం) మాజీ సీఎం జగన్ కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
ఈ క్రమంలో ఆయన మాట్లాడుతూ.. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తాము అబద్దాలు చెప్పకపోవడం వల్లే ఓడిపోయామని వైఎస్ జగన్(Former CM YS Jagan) కార్యకర్తలతో అన్నారు. ప్రజల కోసం ఇన్ని బటన్లు నొక్కిన మనకే ఈ పరిస్థితి ఉంటే రేపు ఇచ్చిన మాటను గాలికొదిలేసిన ఈ కూటమి ప్రభుత్వ(AP Government) పరిస్థితేంటి అని ప్రశ్నించారు. ఈ క్రమంలో కూటమి సర్కార్ పరిస్థితి రేపు ఎలా ఉంటుందో ఊహించుకోవాలని కోరారు. టీడీపీ నేతలు గ్రామాల్లోకి వెళ్లే పరిస్థితి లేదన్నారు. రాబోయేది జగన్ 2.0 పాలన అని 25-30 ఏళ్లు అధికారంలో ఉంటామని ధీమా వ్యక్తం చేశారు. తప్పు చేసిన వారిని వదలబోనని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.






