- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరల్ వీడియోల వెనుక నిజం ఇదే.. వైసీపీపై లోకేశ్ సీరియస్
తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైసీపీకి ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు అని మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తప్పుడు ప్రచారాలకు అలవాటు పడిన వైసీపీకి ఎన్ని సార్లు చెప్పినా తన ప్రవర్తన మార్చుకోవడం లేదు అని మంత్రి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఎక్స్ వేదికగా వెల్లడించారు. తిరుపతి జిల్లా, సూళ్లూరుపేట నియోజకవర్గం, నాయుడుపేటలో మార్చి 30న టిడ్కో ఇళ్ల గృహ ప్రవేశాల కార్యక్రమం సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఒక లబ్ధిదారుకు ఇచ్చిన హామీ ని వక్రీకరించి కొందరు అప్పటి లో తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. వారికి AP Government Fact Check ద్వారా వివరణ ఇచ్చినట్లు స్పష్టం చేశారు. అయినా ఇప్పుడు మళ్లీ తాజాగా అదే అంశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ముక్కర అంబిక అనే లబ్దిదారు ఇంటికి వెళ్లి అక్కడ శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించిన అనంతరం వారి కష్ట సుఖాలు అడిగి తెలుసుకున్నారని అన్నారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు వారికి కొన్ని హామీలు ఇచ్చారని చెప్పుకొచ్చారు.
అంబిక భర్త ఆటో డ్రైవర్ కావడంతో ఆయనకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాల్సిందిగా జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారని అన్నారు. ముఖ్యమంత్రి ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే ఎదురుగా ఉన్న ఇంటి గడప వద్ద ఉన్న మరొక మహిళ తన కుమారుడి ఉద్యోగం విషయం ప్రస్తావించారు.. సీఎం అంబిక భర్తకు బ్యాటరీ ఆటో కొనిపెట్టాలి అని ఇచ్చిన ఆదేశాలను ఆ మహిళ అడిగిన విషయానికి జత చేసి ‘చదువుకున్న వ్యక్తికి ఆటో కొనిపెడతారట’ అంటూ సోషల్ మీడియాలో అపహాస్యం చేశారని, ఈ ప్రయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వెల్లడించారు. వీడియోలను తప్పుడు అర్ధం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరం అని, ఇలాంటి ప్రయత్నాలు చేసేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు.






