మహిళలకు బ్యాడ్ న్యూస్.. తిరుమలకు ఫ్రీ బస్సు లేదు.. కారణం ఏంటంటే..

by Naga Rani Yarlagadda |

ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం (Stree Shakti) పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది.

మహిళలకు బ్యాడ్ న్యూస్.. తిరుమలకు ఫ్రీ బస్సు లేదు.. కారణం ఏంటంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ ప్రభుత్వం స్త్రీ శక్తి పథకం (Stree Shakti) పేరుతో ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు (Free Bus) ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. జీరో టికెట్ (Zero Ticket)తో అనేక మంది మహిళలు లబ్ధి పొందుతున్నారని తెలిపింది. పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో, ఎక్స్ ప్రెస్ వంటి బస్సుల్లో రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ప్రభుత్వ గుర్తింపు కార్డును చూపించి ఉచితంగా ప్రయాణించవచ్చు.

కానీ.. తిరుపతి నుంచి తిరుమల (Tirupati to Tirumala) కొండపైకి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం లేదని తిరుమల డిపో (Tirumala Depot) స్పష్టం చేసింది. కొండపైకి వెళ్లే ఏ బస్సులోనూ మహిళలకు ఈ పథకం వర్తించదని తేల్చి చెప్పింది. ప్రతిపక్షాలు దీనిపై విమర్శలు గుప్పిస్తుండటంతో టీడీపీ (TDP) కార్యకర్తలు సోషల్ మీడియాలో కౌంటర్ ఇస్తున్నారు. ఉన్న మొత్తం బస్సుల్లో 85 శాతం ఫ్రీగా ఇచ్చామని, 11,449 బస్సులు ఉండగా.. 8,458 బస్సులు స్త్రీ శక్తి కోసం కేటాయించామన్నారు. టీటీడీ (TTD)కి చెందిన సప్తగిరి బస్సుల్లో మాత్రం ఫ్రీ బస్సు సౌకర్యం ఇవ్వలేకపోయామని, అవి టీటీడీ కిందకు రావడంతో టెక్నికల్ సమస్యలు ఉన్నాయని చెప్తున్నారు. ఏదేమైనా దైవ దర్శనానికి వెళ్లే బస్సుల్లో కూడా ఫ్రీ బస్సు సౌకర్యం కల్పిస్తే బాగుండేదని మహిళా భక్తులు అంటున్నారు. దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో చూడాలి.

Next Story