సీఐడీ కార్యాలయానికి పోసాని.. కారణం ఇదే!

by Jakkula.Mamatha |

ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.

సీఐడీ కార్యాలయానికి పోసాని.. కారణం ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు(CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌(Deputy CM Pawan Kalyan)లపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali) కొన్ని రోజుల పాటు రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో పోసాని కృష్ణ మురళికి బెయిల్ రావడంతో జైలు నుంచి బయటకు వచ్చారు. ఈ నేపథ్యంలో ఆయనకు గుంటూరు కోర్టు కొన్ని షరతులు విధించింది. దేశం విడిచి వెళ్లరాదని, ఆయన పై నమోదైన కేసుల గురించి బహిరంగంగా మాట్లాడకూడదని, మీడియాకు ప్రకటనలు ఇవ్వరాదని షరతులు విధించింది.

అలాగే నాలుగు వారాల పాటు ప్రతి సోమ, గురువారాల్లో మంగళగిరిలోని సీఐడీ కార్యాలయం(CID Office)లో సంతకం చేయాలని వెల్లడించింది. దీంతో గుంటూరు కోర్టు బెయిల్ షరతుల ప్రకారం.. పోసాని ఈరోజు(గురువారం) సీఐడీ కార్యాలయానికి వెళ్లారు. కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ కార్యాలయంలో సంతకం చేశారు. అలాగే కోర్టు నిబంధనలు పాటించాలని.. కేసు దర్యాప్తుకు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేసింది.

Next Story