- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోవడానికి అసలు కారణం ఇదే.. రేవంత్ వ్యాఖ్యల్ని ఖండించిన మంత్రి సవిత
తెలంగాణ ప్రయోజనాల కోసం ఏపీ రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేసిందని సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలను మంత్రి సవిత ఖండించారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ప్రయోజనాల కోసం కూటమి ప్రభుత్వం రాయలసీమ లిఫ్ట్ పనులను నిలిపివేసిందంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి సవిత ఖండించారు. చంద్రబాబు పేరునువాడి రాజకీయంగా లబ్ధి పొందేందుకు రేవంత్ ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి హయాంలో ఎలాంటి అనుమతులు లేకుండా ప్రాజెక్టును చేపట్టారని ఆమె తెలిపారు. రాయలసీమకు రోజుకు మూడు టీఎంసీల నీరు ఇస్తామంటూ భారీ ప్రకటనలు ఇచ్చిందని, దీంతో తెలంగాణ ప్రభుత్వం కోర్టులో కేసులు వేసిందని చెప్పారు. కేంద్రప్రభుత్వం, ఎన్జీటీలకు కూడా తెలంగాణ సర్కారు ఫిర్యాదు చేసిన విషయం గుర్తు చేశారు. దీంతో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పనులు ఆగిపోయాయని వివరించారు. ఈ మేరకు 2020లోనే ఎన్జీటీ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చాయని స్పష్టం చేశారు.
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోవడం ముమ్మాటికీ జగన్ చేసిన తప్పేనన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే ఆగిపోయిన ఈ ప్రాజెక్టుకు చంద్రబాబుకు లింక్ పెట్టి రేవంత్ వ్యాఖ్యలు చేయడం సరికాదని తెలిపారు. జగన్ చేసిన తప్పుకు తమను బాధ్యుల్ని చేయడాన్ని ఖండించారు. ఏపీ నీటిహక్కులు, రాయలసీమ సాగునీటి ప్రయోజనాల విషయంలో రాజీ ఉండబోదని కూడా స్పష్టం చేశారు. త్వరలోనే ప్రాజెక్టుకు సంబంధించిన అన్ని ఆధారాలతో వాస్తవాలను బయటపెడుతామని తేల్చి చెప్పారు.






