2 లక్షల మంది పెన్షన్లు తొలగింపు.. ప్రభుత్వం క్లారిటీ ఇదే!

by Jakkula.Mamatha |

ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పింఛన్ల మొత్తాన్ని పెంచిన విషయం తెలిసిందే.

2 లక్షల మంది పెన్షన్లు తొలగింపు..  ప్రభుత్వం క్లారిటీ ఇదే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి వచ్చాక ఎన్టీఆర్ భరోసా పథకంలో భాగంగా పింఛన్ల మొత్తాన్ని పెంచిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తుంది. ఇందులో భాగంగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, చేనేత కార్మికులు, మత్స్యకారులు, చర్మకారులు, డప్పు కళాకారులు, హిజ్రాలు, హెచ్ఐవి బాధితులు, కళాకారులకు నెలకు రూ.4000, దివ్యాంగులకు రూ.6,000, కిడ్నీ, తలసీమియా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు రూ.10 వేలు, పూర్తి స్థాయి వైకల్యం ఉన్న వారికి నెలకు రూ, 15,000లకు పెంచి పంపిణీ చేస్తోంది.

ఇదిలా ఉంటే.. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో దివ్యాంగులు, ఇతర కేటగిరీల్లో భారీగా అనర్హులకు పింఛన్లు మంజూరు చేశారనే ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కొంతమంది పింఛన్ దారులను తొలగించిందనే ప్రచారం జరిగింది. ఈ క్రమంలో ఆ ప్రచారం పై తాజాగా ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వం మరో 2 లక్షల మందికి పెన్షన్లు కట్ చేయనుందని జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ ఫ్యాక్ట్ చెక్ విభాగం ఖండించింది. ఈ నేపథ్యంలో ‘‘పెన్షన్లు తీసేస్తున్నారంటూ వివిధ సోషల్ మీడియా, మీడియా, పలు వెబ్‌సైట్లలో రకరకాల తప్పుడు కథనాలు వెలువడుతున్నాయి. పెన్షన్లు ఎక్కడా తగ్గించడం లేదు. పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇలాంటి వార్తలను ప్రజలు నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కాగా, ప్రజెంట్ రాష్ట్రంలో 63,59,907మంది పింఛన్ లబ్దిదారులు ఉన్నారు.

Next Story