- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
DSC హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ కు డైరెక్ట్ లింక్ ఇదే!
రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తోంది.

దిశ,వెబ్‌డెస్క్: రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పనే లక్ష్యంగా ముందుకెళ్తోంది. ఈ క్రమంలో ఏపీ(Andhra Pradesh)లోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం (AP Government) అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ(Mega DSC) నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఈ క్రమంలో 16, 347 టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించనున్న మెగా డీఎస్సీ పరీక్షల హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. జూన్ 6 నుంచి జూలై 6 వరకు రోజుకు రెండు సెషన్లలో ఈ పరీక్షలు నిర్వహిస్తామని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ తాజాగా విడుదలైన షెడ్యూల్ ప్రకారం.. జూన్ 6నుంచి జూన్ 30వ తేదీ వరకు పరీక్షలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేసినట్లు డీఎస్సీ కన్వీనర్ కృష్ణారెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక https://apdsc.apcfss.in/ వెబ్‌సైట్‌లో లాగిన్ అయ్యి హాల్‌టికెట్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
మెగా డీఎస్సీ 2025 నోటిఫికేషన్‌లో సెకండరీ గ్రేడ్ టీచర్స్ (SGT), స్కూల్ అసిస్టెంట్స్ (SA), ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (TGT), పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ (PGT), ప్రిన్సిపల్స్ వంటి పోస్టులు ఉన్నాయి. ఏపీ డీఎస్సీ-2025 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి ఈ పత్రాలను కచ్చితంగా తీసుకెళ్లాలి. ఏపీ డీఎస్సీ అడ్మిట్ కార్డ్(హాల్ టికెట్) హార్డ్ కాపీ, రెండు లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు, ప్రభుత్వం జారీ చేసిన ఏదైనా ID.. ఆధార్ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్‌గా తీసుకెళ్లాని సూచించారు.






