- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వారి పెన్షన్ తొలగింపు.. రాష్ట్ర మంత్రి క్లారిటీ ఇదే!
రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచింది.

దిశ, వెబ్‌డెస్క్: రాష్ట్రం(Andhra Pradesh)లో ఎన్డీయే కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం కూటమి ప్రభుత్వం(AP Government) అధికారంలోకి రాగానే పెన్షన్ పెంచింది. ఈ క్రమంలో పింఛన్(AP Pensions) లబ్దిదారులకు ఇంటింటికి వెళ్లి పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే కూటమి ప్రభుత్వం అనర్హులుగా గుర్తించబడిన పలువురి పెన్షన్లు తొలగించింది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో పెన్షనర్ల సంఖ్య 66,34,372 ఉంటే.. ఇప్పుడు 63,36,932 మాత్రమే ఎందుకు ఉంది అని మాజీ సీఎం జగన్ ఇటీవల కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన విషయం తెలిసిందే.
ఈ అంశం పై తాజాగా మంత్రి కొండపల్లి శ్రీనివాస్(Minister Kondapalli Srinivas) స్పందించారు. అనర్హులకు పెన్షన్ తీసేసిన తప్పులేదని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అసెంబ్లీ(Assembly) వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో అర్హులైన ప్రతి పేద కుటుంబానికి సామాజిక భద్రతా పెన్షన్లు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని తేల్చి చెప్పారు. ప్రస్తుతం 63 లక్షల పైచిలుకు మందికి పెన్షన్లు అందిస్తున్నామని తెలియజేయడానికి గర్వపడుతున్నాము అన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాది 4.5 లక్షల మందికి అన్యాయంగా పెన్షన్లు తొలగించిందని అన్నారు. గత ఐదేళ్ల పాలనలో సగటున ఏడాదికి రెండు లక్షల మందికి చొప్పున మొత్తం పది లక్షల పైచిలుకు మందికి పెన్షన్లను తొలగించి అన్యాయం చేశారని ఫైరయ్యారు.
ఎన్డీయే ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు(CM Chandrababu) పాలనలో ఏ విధమైన అవినీతి, ప్రలోభాలకు తావు లేకుండా పెన్షన్లు అందిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఈ క్రమంలో తాము 14 వేల పెన్షన్లు తొలగించామని, కానీ లక్షల్లో తొలగిస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. తొలగించిన వారిలో 10వేల మంది శాశ్వత వలసదారులు, 4వేల మంది అనర్హులు అని వెల్లడించారు. పెన్షన్ల తొలగింపు అంటూ రాజకీయ ప్రయోజనాల కొరకు అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రస్తుతం 63,59, 907 మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారని, పెన్షన్లపై సర్వే పకడ్బందీగా జరుగుతుందని వివరించారు.






