ఇది చారిత్రాత్మకం: పల్లా శ్రీనివాస్​

by Yella Dhawani Reddy |   (  Updated:2025-05-27 06:56:54  IST  )

తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది.

ఇది చారిత్రాత్మకం: పల్లా శ్రీనివాస్​
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలుగుదేశం పార్టీ (TDP) మహానాడు కడపలో అట్టహాసంగా ప్రారంభమైంది. పార్టీ జెండా ఆవిష్కరించి, జ్యోతి ప్రజ్వలనతో ప్రతినిధుల సభను ప్రారంభించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ (Palla Srinivas) ​మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేసిన వారికి పార్టీలో ఉన్నత స్థానం దక్కుంతుందని అనడానికి తానే నిదర్శనం అన్నారు. కడపలో మహానాడు పెడదామంటే కొందరు పార్టీ నాయకులు ఎన్నో అపోహలు పెట్టారని అన్నారు. కానీ ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ఇచ్చిన తోడ్పాటు ఎంతో ఉందన్నారు. తెలుగు వారి ఆత్మ గౌరవం అనే నినాదంతో తెలుగుదేశం పార్టీ స్థాపించారని గుర్తు చేశారు. కడపలో మహానాడు నిర్వహించడం చారిత్రాత్మకం అన్నారు. సుమారు 40 సంవత్సరాలుగా అలుపెరగని శ్రామికుడిగా తెలుగుదేశం పార్టీని తన భుజస్కందాలపై వేసుకుని చంద్రబాబు నడిపిస్తున్నారని అన్నారు. ఎన్ని సంక్షోభాలు వచ్చినా తెలుగుదేశం పార్టీని క్రమశిక్షణతో పార్టీని నడిపిస్తున్నారని తెలిపారు. చంద్రబాబు విజనరీ అని కొనియాడారు. నాడు విజన్​-2020, నేడు విజన్-​2047 రూపొందించారని అన్నారు. మనమంతా ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉందన్నారు. యువగళం ద్వారా పార్టీలో స్ఫూర్తి నింపిన లోకేశ్​సేవలను కొనియాడారు. లోకేశ్​కాబోయే భవిష్యత్​నాయకుడు అని అన్నారు. మంగళగిరిలో ఓడిపోయినా తిరిగి అక్కడే ప్రజల కోసం పనిచేసి విజయాన్ని అందుకున్నారని తెలిపారు. యువగళం ద్వారా పార్టీకి లోకేశ్​ కొత్త శక్తిని ఇచ్చారని అన్నారు. చంద్రబాబు, లోకేశ్​ను చూసి క్రమ శిక్షణ నేర్చుకోవాలన్నారు.

Next Story