- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హోంమంత్రి అనిత పై పవన్ కల్యాణ్ ప్రశంసలు.. ఆమె రియాక్షన్ ఇదే!
విశాఖ సింహాచలం ఆలయంలో మంగళవారం భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే

దిశ,వెబ్‌డెస్క్: విశాఖ సింహాచలం ఆలయంలో మంగళవారం భారీ వర్షానికి గోడ కూలి ఏడుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ప్రమాద సమయంలో హోం మంత్రి అనిత బాధ్యత తీసుకొని పని చేయడం అభినందనీయమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నిన్న(బుధవారం) ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు. ఈ క్రమంలో హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Anitha) పై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్(Deputy CM Pawan kalyan) ప్రశంసలు కురిపించారు.
విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు హోం మంత్రిగా బాధ్యతల నిర్వహణలో వంగలపూడి అనిత చూపిస్తున్న చొరవ, బాధితులకు బాసటగా నిలుస్తున్న తీరు అభినందనీయమని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రశంసలకు హోం మంత్రి అనిత స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ‘‘అన్నా, మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు నాకు చాలా ప్రోత్సాహాన్నిస్తుంది.. ప్రతి ఒక్కరూ బాధ్యతగా వెంటనే చర్యలు చేపట్టాం. సీఎం చంద్రబాబు(CM Chandrababu) చూపిన నాయకత్వం మాకు ప్రేరణగా నిలిచింది’’హోంమంత్రి వంగలపూడి అనిత పేర్కొన్నారు.






