‘ఇది ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి’.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |   (  Updated:2025-07-12 07:33:05  IST  )

ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

‘ఇది ప్రజాస్వామ్యం పై జరిగిన దాడి’.. వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు పై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రశ్నించడం, నిరసన తెలపడం, ప్రభుత్వ వైఫల్యాలను తెలియజెప్పే స్వేచ్ఛ అనేవి ప్రజాస్వామ్యానికి పునాది అని వైఎస్ జగన్ అన్నారు. కానీ.. ఏపీలో సీఎం చంద్రబాబు నిరంకుశ పాలనతో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని తెలిపారు. ప్రజాసమస్యలను ప్రశ్నించే ప్రతిపక్ష గొంతును అణచివేయడం ప్రజాస్వామ్యం పై సీఎం చంద్రబాబు చేసిన దాడేనని మాజీ సీఎం వైఎస్ జగన్ ఆరోపించారు.

ఈ తరుణంలో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని ప్రశ్నించే గొంతులను నులిమేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అధికారంలోకి వచ్చాక.. తప్పుడు కేసులు, అరెస్టులు , మీడియా అసత్య కథనాలతో బీభత్సం సృష్టిస్తున్నారని అన్నారు. గుంటూరు మిర్చి యార్డు నుంచి బంగారుపాళ్యం పర్యటన దాకా ప్రతీసారి తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం చంద్రబాబు ప్రశ్నించే గొంతుకలను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఫైరయ్యారు. వేధింపులు ఎదురైన రాష్ట్రంలోని ప్రజల సమస్యలపై పోరాడుతూనే ఉంటాం అని మాజీ సీఎం జగన్ తేల్చి చెప్పారు. ఈ మేరకు తన పర్యటనలను అడ్డుకోవడం పై వైఎస్ జగన్ ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

ట్వీట్

Next Story