దొంగలు IAS వ్యవస్థలోనూ ఉన్నారు.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-12-26 07:05:09  IST  )

ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ (IAS)లపై ఓ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి.

దొంగలు IAS వ్యవస్థలోనూ ఉన్నారు.. ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ (IAS)లపై ఓ ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా దుమారాన్ని రేపుతున్నాయి. కలెక్టర్లు రాష్ట్ర వ్యవస్థకు గ్రహణం, దరిద్రం పట్టినట్లుగా పట్టారని ఎమ్మెల్సీ, సొసైటీ ఫర్ ఎంప్లాయిమెంట్ జనరేషన్ అండ్ ఎంటర్‌ప్రైజెస్ డెవలప్‌మెంట్ ఇన్ ఏపీ చైర్మన్ గునపటి దీపక్ రెడ్డి (Deepak Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గత 14 నెలలుగా తనకు జీతం ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇదే విషయంలో ఫైనాన్స్ సెక్రటరీకి ఎన్నిసార్లు చెప్పినా తన ఫైల్ క్లియర్ చేయడం లేదని తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఇన్ని నెలలుగా ఒక్క ఫైల్ క్లియర్ చేయలేని అధికారికి ఆ సీటులో కూర్చునే అర్హత లేదని దీపక్ రెడ్డి ధ్వజమెత్తారు.

IAS అధికారులు, వారు తమ అవినీతి కోసమే పనుల్లో కాలయాపన చేస్తున్నారని దీపక్ రెడ్డి పైర్ అయ్యారు. దొంగలు IAS వ్యవస్థలోనూ ఉన్నారంటూ ఓ రేంజ్‌లో సెటైర్లు వేశారు. కలెక్టర్లు డ్రామాలు చేస్తూ నీతులు మాట్లాడుతున్నారని.. ఏమీ రోగం వచ్చిందోనని విమర్శించారు. IAS అధికారుల జీతం ఎంత వస్తుందో తెలీదు కానీ.. ఆ జీతంతో కొందరైతే ఏకంగా 8 నుంచి 10 బెడ్‌రూమ్ ఇళ్లు ఎలా కడుతున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అదేవిధంగా IAS అధికారులు, కలెక్టర్లు ఇచ్చిన తప్పుడు సమాచారంతోనే 2019లో చంద్రబాబు, 2024లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల్లో ఓడిపోయారని కామెంట్ చేశారు. అయితే తాజాగా, దీపక్‌ రెడ్డి వ్యాఖ్యలు ఏపీ బ్యూరోక్రసీలో హాట్ టాపిక్‌గా మారాయి.

Next Story