- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దివ్యాంగుడిని చూసి చలించిపోయిన మంత్రి.. ఏమిచ్చాడో తెలుసా..?
దివ్యాంగుడిని చూసి చలించిపోయి ఇంటి స్థలం పట్టా మంజూరు చేయించి ఇచ్చారు...

దిశ, వెబ్ డెస్క్: మంత్రి నిమ్మల రామానాయుడు(Minister Nimmala Ramanaidu) మంచి మనసును గురించి వేరే చెప్పక్కర్లేదు. ప్రతిపక్షంలో ఉన్నా, అధికారంలో ఉన్న అయినా స్టేలే వేరు. ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటారు. అవసరమైతే సైకిల్ తొక్కుకుంటూ వెళ్లిపోతారు. ప్రజా సమస్యలు తెలుసుకుని పోరాటం చేశారు. ఆయన చేసే సహాయాలపైనా ప్రత్యేకంగా ప్రస్తావించనవసరంలేదు. తాజాగా ఆయన చేసిన సహాయం ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసింది. తాము కూడా ఇలాంటి సాయం చేయాలనే భావన కలిస్తోంది
మంత్రి రామానాయుడు గతంలో యలమంచిలి గ్రామంలో పర్యటించారు. ఆ సమయంలో విజయలక్ష్మి అనే మహిళ ఇంటికి వెళ్లారు. ఆ కుటుంబసభ్యులను పరామర్శించారు. వారి సమస్యను తెలుసుకున్నారు. అయితే అక్కడ ఉన్న దివ్యాంగుడు సాయిని చూసి చలించిపోయారు. తమకు ఇంటి స్థలం పట్టా ఇప్పించాలని విజయలక్ష్మి కుటుంబం కోరింది. దీంతో మంత్రి రామానాయుడు ఇప్పిస్తానని చెప్పారు.
ఆ హామీని మంత్రి నిమ్మల రామానాయుడు తాజాగా నెరవేర్చారు. ఇంటి స్థలం పట్టాను విజయలక్ష్మి కుటుంబానికి అందజేశారు. ఇంటి నిర్మాణ మంజూరుతో పాటు తాను కొంత సాయం చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆ ఫ్యామిలీ సంతోషం వ్యక్తం చేశారు.






