‘వారికి భయపడే ప్రసక్తే లేదు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం నిధులు గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

‘వారికి భయపడే ప్రసక్తే లేదు’.. మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ సీఎం చంద్రబాబు పోలవరం నిధులు గత వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించిందని చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ క్రమంలో నేడు(గురువారం) ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం చంద్రబాబు వైసీపీ ప్రభుత్వం పోలవరం నిధులు మళ్లించినట్లు నిరూపించండని సవాల్ విసిరారు. నిధులు మళ్లించినట్లు నిరూపిస్తే చంద్రబాబుకు సాష్టాంగ నమస్కారం చేస్తానని వ్యాఖ్యానించారు.

ఈ క్రమంలో పోలవరాన్ని సర్వనాశనం చేసింది చంద్రబాబే అని మండిపడ్డారు. అధికారం లేనప్పుడు పోయే వారి గురించి ఆలోచించ వద్దు అన్నారు. నన్ను కూడా జైల్లో వేస్తా అంటున్నారని అన్నారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యకాంతిని ఆపలేరు.. అరెస్టులను సాధించి ప్రజాశక్తిని సాధించలేరని ఆయన పేర్కొన్నారు. అరెస్టులను సాధించి జగన్ శక్తి ఆపలేరని అంబటి రాంబాబు తెలిపారు. ఏసీబీ, సీఐడీ, పోలీసుల కేసులకు భయపడే ప్రసక్తే లేదని అంబటి రాంబాబు తేల్చి చెప్పారు. అరెస్టులను సాగించి వైఎస్ జగన్ శక్తిని ఆపలేరని, ఆ కేసులకు భయపడే వాళ్లు వైసీపీ నుంచి సర్దుకుంటారని, లేని వాళ్లు కొనసాగుతారన్నారు.

నిలబడి పోరాడటం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య అన్నారు. మాజీ సీఎం జగన్‌ను నిర్భందించడంతోనే ఈ రాజకీయ పార్టీ దూకుడు ప్రారంభమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలో వికృత చేష్టలు చేస్తున్న రెడ్‌బుక్ రచయిత, సీఎం చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్ దుస్థితి రాబోయే కాలంలో చూడబోతున్నామని జోస్యం చెప్పారు. తమ పార్టీ నుంచి వెళ్లిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు ఆ ఇంటినే తగలబెడదామంటున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు దుయ్యబట్టారు. సమయం వచ్చినప్పుడు అధ్భుతంగా ముందుకు వెళ్తామని పేర్కొన్నారు.

Next Story