ఫ్రీ చికెన్ భోజనాల కోసం ఎగబడి, బారులు తీరి తిన్న జనం (వీడియో)

by Gantepaka Srikanth |   (  Updated:2025-02-22 13:46:15  IST  )

తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ భయంతో ప్రజలు చికెన్(Chicken) తినాలంటేనే భయంతో వణికిపోతున్నారు.

ఫ్రీ చికెన్ భోజనాల కోసం ఎగబడి, బారులు తీరి తిన్న జనం (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ(Bird Flu) మహమ్మారి కలకలం రేపుతోంది. ఈ వైరస్ భయంతో ప్రజలు చికెన్(Chicken) తినాలంటేనే భయంతో వణికిపోతున్నారు. ఆదివారం రోజు కూడా వేరే ఇతర మటన్(Mutton), ఫిష్‌(Fish)తో పాటు కూరగాలయలైనా వండుకుంటున్నారు.. కానీ చికెన్ మాత్రం ముట్టుకోవడం లేదు. దీంతో రెండు తెలుగు రాష్ట్రాల్లోని చికెన్ దుకాణాలు వెలవెలబోతున్నాయి. ముఖ్యంగా పశ్చిమగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలలో బర్డ్ ఫ్లూ వైరస్ సోకి కోళ్లఫారంలలోని కోళ్లు లక్షల సంఖ్యలో మృత్యువాత పడుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే బర్డ్ ఫ్లూ వైరస్‌కు సంబంధించిన అనేక వార్తలు, వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజల్లో బర్డ్ ప్లూపై ఉన్న అపోహలను తొలగించేందుకు ఆంధ్రప్రదేశ్ పశుసంవర్ధక శాఖ(Department of Animal Husbandry) కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రంలో ఎక్కడా బర్డ్ ఫ్లూ నిర్ధారణ కాలేదని ప్రకటించారు. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. చికెన్ తినొచ్చని సూచించారు. చికెన్ మేళాలు నిర్వహించి మరీ ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నారు. తాజాగా.. గుంటూరు(Guntur)లోని పట్టాభిపురం స్వామి థియేటర్ గ్రౌండ్‌లో బర్డ్ ఫ్లూపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పౌల్ట్రీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ చికెన్ ఫుడ్ మేళాలో ఉచితంగా చికెన్ వంటకాలు పంపిణీ చేశారు. ఉడికించిన చికెన్, గుడ్లు తినడం వల్ల ఇబ్బంది ఉండదని చెప్పేందుకే ఈ ఫుడ్ మేళా ఏర్పాటు చేశారు. ఇక, ఉచితంగా చికెన్ వంటకాల పంపిణీ అనేసరికి జనాలు భారీగా తరలివచ్చారు. ఫుడ్ మేళా ప్రాంగణం నిండిపోవడంతో నిర్వాహకులు గేట్లు మూసేయాల్సి వచ్చింది.

Next Story