వాళ్లు 420 కాబట్టే 320 నెయ్యి కొన్నారు.. వైసీపీపై సోము వీర్రాజు హాట్ సెటైర్లు

by Kema Shiva Kumar |

తిరుమలలోనే కాదు అన్ని ఆలయాల్లోనూ స్వచ్ఛమైన నెయ్యితతో అడ్డూ తయారు చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

వాళ్లు 420 కాబట్టే 320 నెయ్యి కొన్నారు.. వైసీపీపై సోము వీర్రాజు హాట్ సెటైర్లు
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసన మండలిలో టెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు (Somu Veerraju) పైకి వైసీపీ (YCP) సభ్యులు ఇజ్రాయెల్‌, విక్రాంత్‌, రమేశ్‌ యాదవ్‌ దూసుకెళ్లారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై మంత్రి నిమ్మల రామానాయుడు సమాధానం పూర్తయిన తర్వాత చర్చకు వైసీపీ సభ్యులు పట్టుబట్టారు. మంత్రి ప్రసంగం తర్వాత ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడేందుకు యత్నించగా.. ఆయన పైకి ఎమ్మెల్సీ ఇజ్రాయెల్‌తో పాటు ఆ పార్టీకి చెందిన కొందరు సభ్యులు దూసుకెళ్లారు.

అనంతరం సభ నుంచి బయటకు వచ్చిన సోము వీర్రాజు మీడియా ప్రతినిధులుతో చిట్‌చాట్‌లో మాట్లాడారు. తిరుమల లడ్డూకు నెయ్యి సరఫరాపై బాధ్యతగా ఉండాలని అన్నారు. అవసరం అయితే టాటా (TATA), రిలయన్స్ (Reliance) సంస్థల సహకారం తీసుకోవాలన్నారు. వైసీపీ వాళ్లు 42 కాబట్టే.. నెయ్యిని 320కి కొన్నారంటూ సెటైర్లు వేశారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి బహిరంగ మార్కెట్‌లో రూ.2వేల వరకు ఉంటుందని అన్నారు. లడ్డూలో వాడేది అసలు నెయ్యే కాదని కామెంట్ చేశారు. డెయిరీ సంస్థలు సరఫరా చేసే నెయ్యి అనబోరని అన్నారు. తిరుమలలోనే కాదు అన్ని ఆలయాల్లోనూ స్వచ్ఛమైన నెయ్యితతో అడ్డూ తయారు చేయాలని ఎమ్మెల్సీ సోము వీర్రాజు డిమాండ్ చేశారు.

Next Story