- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడే అన్నదాత సుఖీభవ నిధులు.. అనర్హులు వీరే!
by Muthe.Rajitha |
పీఎం కిసాన్ సమ్మాన్ నిధులతోపాటు, అన్నదాత సుఖీభవ నిధులు కూడా నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్ : పీఎం కిసాన్ సమ్మాన్ నిధులతోపాటు, అన్నదాత సుఖీభవ నిధులు కూడా నేడు అర్హులైన రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. దాదాపు 46.86 లక్షల రైతులకు రూ.7 వేల చొప్పున మొత్తం రూ.3135 కోట్ల నిధులు బుధవారం విడుదల కానున్నాయి. అయితే రైతులు అయినప్పటికీ కొంతమందిని అనర్హులుగా గుర్తించింది ప్రభుత్వం.
వారిలో నెలకు రూ.20 వేల కంటే ఎక్కువ జీతం పొందే ఉద్యోగులు, తాజా, మాజీ ప్రజాప్రతినిధులు ఈ పథకానికి అర్హులు కారు. అలాగే ఆక్వా సాగు, వ్యవసాయేతర అవసరాలకు వాడే భూములకు ఈ పథకం వర్తించదు. 10 సెంట్లలోపు భూమి కలిగిన వారు, భూమి ఉన్న మైనర్లు కూడా ఈ పథకానికి అర్హులు కాదని, వారికి ఈ పథకం వర్తించదని ప్రభుత్వం స్పష్టం చేసింది.
Next Story






