తొలిరోజు ముగిసిన టీడీపీ మహానాడు.. రేపు చర్చించే అంశాలివే!

by Jakkula.Mamatha |   (  Updated:2025-05-27 14:03:23  IST  )

టీడీపీ మహానాడు కార్యక్రమం ఈ రోజు(మంగళవారం) కడప జిల్లాలో ఘనంగా జరిగింది.

తొలిరోజు ముగిసిన టీడీపీ మహానాడు.. రేపు చర్చించే అంశాలివే!
X

దిశ,వెబ్‌డెస్క్: టీడీపీ మహానాడు కార్యక్రమం ఈ రోజు(మంగళవారం) కడప జిల్లాలో ఘనంగా జరిగింది. 2024 లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించిన తర్వాత జరుగుతున్న తొలి మహానాడు కావడంతో భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. కడపలో మూడు రోజుల పాటు జరగనున్న మహానాడు తొలి రోజు కార్యక్రమం ముగిసింది. మొదటి రోజు ముగిసిన టీడీపీ మహానాడులో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు, మంత్రులు, టీడీపీ నేతలు హాజరయ్యారు.

ఈ క్రమంలో సీఎం చంద్రబాబు కార్యక్రమంలో మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు. పలువురు మంత్రులు కూడా పలు విషయాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ తెలుగు ప్రజల భవిష్యత్తు కోసం మంత్రి నారా లోకేష్ 6 శాసనాలను ఇవాళ జరిగిన టీడీపీ మహానాడులో ప్రతిపాదించారు.

1.తెలుగుజాతి విశ్వఖ్యాతి, 2.యువగళం, 3.స్త్రీ శక్తి, 4.పేదల సేవల్లో సోషల్‌ రీఇంజనీరింగ్‌, 5.అన్నదాతకు అండగా, 6. కార్యకర్తే అధినేత. ఇదిలా ఉంటే.. కడప జిల్లాలో రేపు(బుధవారం) రెండో రోజు జరగబోయే టీడీపీ మహానాడులో కీలక విషయాలపై చర్చించనున్నట్టు సమాచారం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం, పాలనలో ఏపీ సాధించిన విజయాలు, భవిష్యత్‌ పరిణామాలపై రేపు టీడీపీ మహానాడులో చర్చించనున్నారు.

Next Story