AP News:టీడీపీ సరికొత్త రికార్డ్.. సభ్యత్వ నమోదులో టాప్ టెన్ నియోజకవర్గాలు ఇవే!

by Jakkula.Mamatha |

గత ఏడాది(2024) అక్టోబర్ 26న సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఏపీ, తెలంగాణ, అండమాన్‌లో ప్రారంభించిన టీడీపీ(TDP) సభ్యత్వ నమోదు(Membership Registration) ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది.

AP News:టీడీపీ సరికొత్త రికార్డ్.. సభ్యత్వ నమోదులో టాప్ టెన్ నియోజకవర్గాలు ఇవే!
X

దిశ,వెబ్‌డెస్క్: గత ఏడాది(2024) అక్టోబర్ 26న సీఎం చంద్రబాబు(CM Chandrababu) ఏపీ, తెలంగాణ, అండమాన్‌లో ప్రారంభించిన టీడీపీ(TDP) సభ్యత్వ నమోదు(Membership Registration) ప్రక్రియ జోరుగా కొనసాగుతోంది. ఈ క్రమంలో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో టీడీపీ సరికొత్త రికార్డు సృష్టించింది. తాజాగా సభ్యత్వాలు తీసుకున్న వారి సంఖ్య ఒక కోటి మార్క్‌ను దాటి చరిత్రను తిరగరాసింది. ఇప్పటివరకు 1,00,52,598 మంది టీడీపీ సభ్యత్వం తీసుకున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. 105 నియోజకవర్గాలు 50 వేల సభ్యత్వాల మార్కును దాటాయి. ఈ క్రమంలో కోటి మంది సభ్యుల నమోదుతో టీడీపీ చరిత్ర సృష్టించింది.

ఇదిలా ఉంటే.. పార్టీ సభ్యత్వాల నమోదులో టాప్ టెన్‌లో ఈ నియోజకవర్గాలు ఉన్నట్లు సమాచారం. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పోటీపడి మరీ రికార్డులు సృష్టించారు. 11 నియోజకవర్గాలు(11 constituencies) లక్ష సభ్యత్వాల మార్కును దాటాయి. టాప్ టెన్ లో నెల్లూరు సిటీ 1,49,270, ఆత్మకూరు 1,48,802, పాలకొల్లు 1,48,559, రాజంపేట 1,45,766, కుప్పం 1,38,446, ఉండి 1,21,527, గురజాల 1,11,458, వినుకొండ 1,06,867, మంగళగిరి 1,06,145, కళ్యాణదుర్గం 1,01,221, కొవూరు 1,00,473 ఉన్నాయి. ఈ నేపథ్యంలో పార్టీ సభ్యత్వ నమోదులో తాము చేసిన కష్టానికి గుర్తింపు లభిస్తుందని కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మంత్రి లోకేష్(Minister Lokesh) ఎక్కువ సభ్యత్వాలు చేసిన కార్యకర్తలతో మాట్లాడి అభినందించడం, ప్రోత్సహించడం పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది.

Next Story