తిరుమలలో దాతలకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు ఇవే...

by Muthe.Rajitha |

తిరుమల తిరుపతి శ్రీవారి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది టీటీడీ.

తిరుమలలో దాతలకు ఇచ్చే ప్రత్యేక సౌకర్యాలు ఇవే...
X

దిశ, వెబ్ డెస్క్ : తిరుమల తిరుపతి శ్రీవారి విరాళం ఇచ్చే భక్తులకు ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తుంది టీటీడీ. రూ. లక్ష నుండి కోటి రూపాయలకు పైగా డోనేషన్ ఇచ్చేవారికి కల్పించే సౌకర్యాలివే..

*లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల డొనేషన్ : తిరుమలలో లక్ష నుంచి 5 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒకరోజు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 1 రోజు 100/- రూమ్ ఇస్తారు . 6 చిన్న లడ్డులు, ఒక శాలువా, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.

*ఐదు నుంచి పది లక్షల రూపాయల డొనేషన్ : తిరుమలలో ఐదు నుంచి 10 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి సుపథం దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 100/- రూమ్ ఇస్తారు . 10 చిన్న లడ్డులు, ఒక మహాప్రసాదం, ఒక శాలువా, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు.

*10 నుంచి 25 లక్షల రూపాయల డొనేషన్ : తిరుమలలో 10 - 25 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 500/- రూమ్ ఇస్తారు . 20 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక శాలువా, ఒక బ్లౌజ్ పీస్, 1 సిల్వర్ కాయిన్ (50 గ్రాములు) ఇస్తారు.

*25 - 50 లక్షల రూపాయల డొనేషన్ : తిరుమలలో 25 - 50 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుపథం దర్శనం, మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 1500/- రూమ్ ఇస్తారు . 4 పెద్ద లడ్డులు, 5 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక శాలువా, ఒక బ్లౌజ్ పీస్, 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ), ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు) ఇస్తారు.

*50 - 75 లక్షల రూపాయల డొనేషన్ : తిరుమలలో 50 - 75 లక్షల రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం ఒక రోజు సుప్రభాత సేవ, 2 రోజులు సుపథం దర్శనం, మూడు రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2000/- రూమ్ ఇస్తారు. 6 పెద్ద లడ్డులు, 10 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక శాలువ, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు, 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు), ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు) కూడా ఇస్తారు.

*కోటి రూపాయల డొనేషన్ : తిరుమలలో 75 లక్షల - 1 కోటి రూపాయల డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం రెండు రోజులు సుప్రభాత సేవ, 3 రోజులు సుపథం దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 2500/- రూమ్ ఇస్తారు. 8 పెద్ద లడ్డులు, 15 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక శాలువా, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ), ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు) ఇస్తారు.

*కోటి రూపాయల పైన డొనేషన్ : తిరుమలలో 1 కోటి రూపాయల పైన డొనేషన్ ఇచ్చిన వారికి ప్రతి సంవత్సరం 3 రోజులు సుప్రభాత సేవ, 4 రోజులు సుపథం దర్శనం, 3 రోజులు 5 మందికి బ్రేక్ దర్శనం కల్పిస్తారు. 3 రోజులు 3000/- రూమ్ ఇస్తారు . 10 పెద్ద లడ్డులు, 20 చిన్న లడ్డులు, 10 మహాప్రసాదాలు, ఒక శాలువా, ఒక బ్లౌజ్ పీస్ ఇస్తారు. అలాగే 1 గోల్డ్ డాలర్ ( 5 గ్రాములు ) +ఒక సిల్వర్ కాయిన్ (50 గ్రాములు)తోపాటు పండితుల వేద ఆశీర్వచనం కూడా ఇస్తారు.

Next Story