- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Posani: పోసానిపై నమోదైన కేసులో సెక్షన్లు ఇవే..
హైదరాబాదులోని రాయదుర్గంలో నిన్న రాత్రి అరెస్ట్ అయిన సినీ నటుడు పోసాని కృష్ణమురళిని ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు పోలీసులు తీసుకువచ్చారు.

దిశ డైనమిక్ బ్యూరో: హైదరాబాదులోని రాయదుర్గంలో నిన్నరాత్రి అరెస్ట్ అయిన సినీనటుడు పోసాని కృష్ణమురళిని(Posani krishna murali)ఈరోజు ఉదయం అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లెకు పోలీసులు తీసుకువచ్చారు. రైల్వేకోడూరు కోర్టులో ఈ మధ్యాహ్నం హాజరుపరిచే అవకాశం ఉంది. కృష్ణ మురళి పై 196, 353(2), 111 రెడ్ విత్ 3(5) కేసునమోదు చేశారు. సినీపరిశ్రమపై పోసాని తీవ్ర విమర్శలు చేశారని ఫిర్యాదు అందింది. చెన్నరాజుపోడు మాజీ సర్పంచి జోగినేని మణి ఈ ఫిర్యాదు చేశారు. పవన్ కళ్యాణ్ పై (pawan kalyan) అనుచిత వ్యాఖ్యలు చేశారని, ఆయన కుటుంబ సభ్యులకు అసభ్యకర రీతిలో మాట్లాడారని ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. చంద్రబాబు (chandrababu), లోకేష్ పై (lokest) పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారని మరో కేసు నమోదైంది. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన తెలుగుదేశం, జనసేన నాయకులపై తీవ్ర విమర్శలు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన తీరు మార్చుకోలేదని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఆరోపించారు. వ్యక్తిగత విమర్శలు చేయడంతో ఆయనపై పలువురు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఏపీలోని అనేక ప్రాంతాల్లో ఆయనపై కేసులు నమోదయ్యాయి. సీఐడీకి ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా కేసులు నమోదయ్యాయి. గుంటూరు, విజయవాడ, నర్సరావుపేట, అన్నమయ్య, అనంతపురం, బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి తదితర ప్రాంతాల్లో ఫిర్యాదులు వచ్చాయి. ఆయనపై రాష్ట్రవ్యాప్తంగా పదికిపైగా కేసులు నమోదయ్యాయి.






