- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరులో మాజీ సీఎం జగన్ టూర్.. పోలీసుల ఆంక్షలు ఇవే !
నెల్లూరులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు.

దిశ,వెబ్‌డెస్క్: నెల్లూరులో వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పర్యటించనున్నారు. ఇవాళ(గురువారం) నెల్లూరు పర్యటనకు వైఎస్ జగన్‌కు ఇన్‌చార్జి ఎస్పీ దామోదర్ ఆంక్షలతో కూడిన అనుమతినిచ్చారు. జిల్లా వైసీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్నందున జగన్ పర్యటనకు జనసమీకరణకు చేయొద్దని ఆదేశించారు. ప్లకార్డులు, పోస్టర్ ప్రదర్శించవద్దని 30 యాక్ట్ అమల్లో ఉంటుందని పోలీసులు స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితిల్లోనూ హెలిప్యాడ్ వద్ద10 మంది, జైలు దగ్గర ములాఖత్‌కు ముగ్గురు, నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఇంటి దగ్గర 100 మందికి మించి అనుమతించకూడదని స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో నెల్లూరు టూర్‌లో భాగంగా వైఎస్ జగన్(Former CM YS Jagan) ఉదయం 10.00 గంటల నుంచి 10.30 మధ్య చెముడుగుంట సమీపంలోని హెలిప్యాడ్‌కు జగన్ చేరుకోనున్నారు. అక్కడి నుంచి జైలుకెళ్లి మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డిని కలవనున్నారు. తర్వాత బుజబుజనెల్లూరు, అయ్యప్పగుడి సెంటర్, కరెంటాఫీసు సెంటర్, జీజీహెచ్ మీదుగా సుజాతనగర్‌లోని ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటికి చేరుకుంటారు. నెల్లూరులోని ఒక్కో వార్డు నుంచి 200 నుంచి 300 మందిని సమీకరించేందుకు వైసీపీ(YSRCP) నాయకులు ఏర్పాటు చేసినట్లు సమాచారం.






