AP News:రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలివే!

by Jakkula.Mamatha |

ఏపీ(Andhra Pradesh) సచివాలయంలో రేపు(మంగళవారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది.

AP News:రేపు ఏపీ కేబినెట్‌ భేటీ.. చర్చించే అంశాలివే!
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh) సచివాలయంలో రేపు(మంగళవారం) రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంగళవారం ఉదయం 11 గంటలకు కేబినెట్ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో సీఎం చంద్రబాబు కీలక అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. రేపు జరగబోయే కేబినెట్ భేటీ(Cabinet Meeting)లో ఎస్‌ఐపీబీ(SIPB) ప్రతిపాదనలను ఆమోదించనున్నట్లు సమాచారం. అలాగే, ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఏర్పాటై ఏడాది కావస్తున్న సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి(State Development) పై చేపట్టాల్సిన కార్యక్రమాల పై సీఎం చంద్రబాబు(CM Chandrababu) వివరించనున్నారు. ఈ క్రమంలో ఏడాది పాలన, జిల్లాల వారీగా చేపట్టవలసిన కార్యక్రమాల పై చర్చలు జరగనున్నాయి. ఈ మంత్రివర్గ సమావేశంలో ‘అన్నదాత సుఖీభవ’, ‘తల్లికి వందనం’ విధి విధానాలపై చర్చించనున్నారు.

Next Story