- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TTD:కీలపట్ల శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు.. తేదీలు ఇవే!
ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ(TTD) ప్రకటించింది.

దిశ,వెబ్‌డెస్క్: ఏపీ(Andhra Pradesh)లోని చిత్తూరు జిల్లా కీలపట్లలోని శ్రీ కోనేటిరాయస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల తేదీలను టీటీడీ(TTD) ప్రకటించింది. వచ్చే నెల(మే) 5 నుంచి 13వ తేదీ వరకు వైభవంగా నిర్వహించనున్నారు. ఈ నెల(ఏప్రిల్) 29న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, మే 4న సాయంత్రం 6 నుంచి రాత్రి 8.30 గంటల వరకు సేనాధిపతి ఉత్సవం, అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి.
ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహన సేవలు జరుగుతాయి. ఉత్సవాల్లో భాగంగా మే 9వ తేదీ సాయంత్రం 4 గంటలకు స్వామివారి కల్యాణోత్సవం జరుగనుంది. భక్తులు(Devotees) రూ .500/- చెల్లించి ఇద్దరు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. ఉత్తరీయం, రవికె, అన్నప్రసాదం బహుమానంగా అందజేస్తారు. మే 14వ తేదీ సాయంత్రం 4 గంటలకు పుష్పయాగం వైభవంగా నిర్వహించనున్నారు.
వాహన సేవల వివరాలు..
05-05-2025:ఉదయం – ధ్వజారోహణం (కర్కాటక లగ్నం- మధ్యాహ్నం 12.05 నుండి 12.20 గంటల వరకు), సాయంత్రం – శేష వాహనం
06-05-2025:ఉదయం – తిరుచ్చి ఉత్సవం, సాయంత్రం – హంస వాహనం
07-05-2025:ఉదయం – సింహ వాహనం, సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
08-05-2025:ఉదయం – కల్పవృక్ష వాహనం, సాయంత్రం – సర్వభూపాల వాహనం
09-05-2025:ఉదయం – మోహినీ ఉత్సవం, సాయంత్రం – కల్యాణోత్సవం, గరుడ వాహనం
10-05-2025:ఉదయం – హనుమంత వాహనం, సాయంత్రం – వసంతోత్సవం, గజ వాహనం
11-05-2025:ఉదయం – సూర్యప్రభ వాహనం, సాయంత్రం – చంద్రప్రభ వాహనం
12-05-2025:ఉదయం – రథోత్సవం, సాయంత్రం – అశ్వవాహనం
13-05-2025:ఉదయం – చక్రస్నానం, సాయంత్రం – ధ్వజావరోహణం






