అసెంబ్లీ, మండలిలో గందరగోళం.. ఉభయసభలు రేపటికి వాయిదా

by Vemula.Srinu Prasad |

ఏపీ అసెంబ్లీలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేత అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. వైసీపీ హయాంలోనే ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపిస్తే.. చంద్రబాబు వల్లే నిలిచిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు.

అసెంబ్లీ, మండలిలో గందరగోళం.. ఉభయసభలు రేపటికి వాయిదా
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ అసెంబ్లీ(Ap Assembly)లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిలిపివేత అంశంపై వాడీవేడీగా చర్చ జరిగింది. వైసీపీ హయాంలోనే ఆ ప్రాజెక్టు నిలిచిపోయిందని కూటమి ఎమ్మెల్యేలు ఆరోపిస్తే.. చంద్రబాబు వల్లే నిలిచిపోయిందని వైసీపీ ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. దీంతో రెండు వర్గాల మధ్య విమర్శల వర్షం కురిసింది. చివరకు ఏపీ ప్రాజెక్టులు, నీటి సమస్యలపై సీఎం చంద్రబాబు స్పష్టత ఇచ్చారు. అనంతరం ఏపీ అసెంబ్లీని వాయిదా వేస్తున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు.

అసెంబ్లీలో కల్తీ నెయ్యి ఘటనపై చర్చ

ఇక తిరుమల కల్తీ నెయ్యి అంశం శాసనమండలిని కుదిపేసింది. సభ ప్రారంభం నుంచే అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటలయుద్ధం నడిచింది. ఒకసారి వాయిదా వేసినప్పటికీ శాసనమండలిలో మళ్లీ అదే గందరగోళం కొనసాగించింది. దీంతో మండలి చైర్మన్ మోషేన్ రాజు రేపటి వాయిదా వేశారు.

పయ్యావుల ఫైర్

అంతకుముందు మండలిలో జరిగిన చర్చలో మంత్రి పయ్యావుల మాట్లాడారు. కల్తీ నెయ్యి అంశంపై చర్చకు వైసీపీ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. జగన్ హయాంలో హిందూ సమాజ వ్యతిరేక చర్యలు కొనసాగాయని, తాము ఇప్పుడు ఎండగట్టేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కల్తీ నెయ్యిపై తాము స్టేట్‌మెంట్‌ ఇస్తామంటున్నామని మంత్రి పయ్యావుల తెలిపారు. ఇది ముందుగానే చెప్పామని, లఘు చర్చకు రెడీగా ఉన్నామని మంత్రి పయ్యావుల పేర్కొన్నారు. అర్ధరాత్రి వరకూ చర్చ కొనసాగించినా తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు. వినేందుకు కూడా ఓపిక లేనప్పుడు ప్రశ్నలు ఎందుకు అడగాలని మంత్రి పయ్యావుల ప్రశ్నించారు.

Next Story