మంగళగిరిలో ఉద్రిక్తత.. పీడీఎఫ్‌, కూటమి కార్యకర్తల వాగ్వాదం

by Vemula.Srinu Prasad |

గుంటూరు జిల్లా మంగళగిరిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది...

మంగళగిరిలో ఉద్రిక్తత.. పీడీఎఫ్‌, కూటమి కార్యకర్తల వాగ్వాదం
X

దిశ, వెబ్ డెస్క్: గుంటూరు జిల్లా మంగళగిరి(Mangalagiri)లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పీడీఎఫ్‌, కూటమి కార్యకర్తలు(PDF, Kotami activists) వాగ్వాదం చోటు చేసుకుంది. గుంటూరు- కృష్ణా ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల(Guntur-Krishna Joint District Graduate MLC Election) సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. PDF అభ్యర్థి లక్ష్మణరావు(PDF candidate Lakshmana Rao) కుమారుడిపై దాడికి యత్నించారు. దీంతో పోలీసులు అడ్డుకున్నారు. రెండు వర్గాలను చెదరగొట్టారు. అయితే పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు.


కాగా గుంటూరు- కృష్ణా ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు ఉదయం ప్రారంభమైన ఎన్నికలు సాయంత్రం 4 వరకూ పోలింగ్ జరిగాయి. టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్(TDP MLC Candidate Alapati Rajendra Prasad), పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణరావుతో పాటు పలువురు కూడా పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో పట్టభద్రులు భారీగా పాల్గొని ఓటు హక్కు వినియోగించుకున్నారు. దీంతో పోలింగ్ శాతం భారీగా నమోదు అయింది. ఈ ఎన్నికల ఫలితాలు మార్చి 3న విడుదల కానున్నాయి. చెదురుమదరు ఘటన మినహా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది.

Next Story