ఎక్కడా యూరియా సమస్య లేదు.. అంతా వైసీపీ రాజకీయమే!

by Thanuru Gopichand |

రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నాం.. ఎక్కడా యూరియా సమస్య లేదు.

ఎక్కడా యూరియా సమస్య లేదు.. అంతా వైసీపీ రాజకీయమే!
X

వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు

దిశ డైనమిక్ బ్యూరో : రైతులకు అవసరమైన యూరియాను అందుబాటులో ఉంచుతున్నాం.. ఎక్కడా యూరియా సమస్య లేదు.. వైసీపీ కావాలని రాజకీయం చేస్తోంది.. అని వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అన్నారు. అనంతపురంలో ఈరోజు ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైసీపీ హయాంలో యూరియా కోసం రైతులు అవ‌స్థ‌లు ప‌డ్డారు... కూటమి ప్రభుత్వం ముందుగానే యూరియా సరఫరా చేసి కొరతకు తెరదించిందని తెలిపారు. సీఎం చంద్రబాబు చొరవ వలన, కేంద్ర మంత్రి నడ్డాతో మాట్లాడటం వలన అదనంగా 50 వేల మెట్రిక్ టన్నుల యూరియా రెండు రోజుల్లో రాష్ట్రానికి రానుంది అన్నారు. రబీకి కేంద్రం 9.30 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని తెలిపారు. రూ.130 కోట్లు ఖర్చు చేసి 7.37 లక్షల మంది రైతులకు విత్తనాలు రాయితీతో అందించాం అన్నారు.

వైసీపీ ఉచిత పంటల భీమా పేరుతో మోసం చేసింది – మా ప్రభుత్వం రైతులకు సమయానికి పరిహారం అందిస్తోంది అని వెల్లడించారు. ఉల్లికి క్వింటాకు వైసీపీ రూ.770 మాత్రమే ప్రకటిస్తే, కూటమి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ప్రక టించి, అదే ధరకు కొనుగోలు చేస్తోంద అన్నారు. టొమాటో, మామిడి, మిర్చి, కోకో, పొగాకు ధరలు పడిపోతే – మా ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేసి రైతులకు అండగా నిలిచిందన్నారు. పశు భీమా పరిహారం రూ.37,500 నుండి రూ.50,000కి పెం చి రైతులపై భారాన్ని తగ్గించాం. మత్స్యకారుల భృతి రూ.10,000 నుండి రూ.20,000లకు పెంచి 1.21 లక్షల కుటుంబాలకు 242.8 కోట్లు చెల్లించాం.ఆక్వా రైతులకు యూనిట్‌కు రూ.1.50 సబ్సిడీ రేటుతో విద్యుత్ అందిస్తున్నాం... అని ఆయన పేర్కొన్నారు. డ్రిప్ ఇరిగేషన్, ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్‌గా మార్చాం.అన్నదాత సుఖీభవ పథకంలో 46.86 లక్షల మంది రైతులకు రూ.3,174 కోట్లు చెల్లించాం అని మంత్రి వివరించారు.

Next Story