మహిళలపై అసభ్య పోస్టలు పెడితే ఊరుకునేది లేదు

by Thanuru Gopichand |

సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ, అడవారిపై తప్పుగా పోస్ట్ లు పెడుతున్నారు.. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే ఊరుకునేది లేదు,

మహిళలపై అసభ్య పోస్టలు పెడితే ఊరుకునేది లేదు
X

రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ

దిశ, డైనమిక్​ బ్యూరో : ‘సోషల్ మీడియాను ఇష్టానుసారంగా ఉపయోగిస్తూ, అడవారిపై తప్పుగా పోస్ట్ లు పెడుతున్నారు.. ఇకపై మహిళల పట్ల అసభ్యకరంగా సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడితే ఊరుకునేది లేదు,చర్యలు తప్పనిసరి గా తీసుకుటాం,,’ అని రాష్ట్ర మహిళ కమిషన్ చైర్మన్ రాయపాటి శైలజ హెచ్చరించారు. మంగళగిరి మహిళా కమిషన్ కార్యాలయంలో చైర్మన్ గా ఈరోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు అప్పగించిన బాధ్యతలను నమ్మకంతో నెరవేరుస్తానని అన్నారు. మహిళ హక్కులు, సంక్షేమ సాధనకు తోడ్పడతానని తెలిపారు. మహిళల రక్షణ కోసం పాడుపడతానన్నారు. గత 5 ఏళ్లలో మహిళ కమిషన్ తూతుమంత్రంగా వ్యవహరించిందని ఆరోపిం చారు. తాను పార్టీలకు అతీతంగా, అందరికీ న్యాయం చేస్తానన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్, గంజాయి లేకుండా చేయాలని కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందని తెలిపారు

Next Story