విజయవాడ ఉత్సవ్​లో ఎలాంటి మార్పు లేదు

by Thanuru Gopichand |

అందరి సహకారంతో విజయవాడ ఉత్సవ్ కార్యమాన్ని నిర్వహిస్తాము.. అందులో ఎలాంటి మార్పు లేదని విజయవాడ ఉత్సవ్, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు.

విజయవాడ ఉత్సవ్​లో ఎలాంటి మార్పు లేదు
X

హైకోర్టు స్టేని గౌరవించి వేరే చోట ఏర్పాటు చేస్తాం..

కొమ్మారెడ్డి పట్టాభిరామ్

దిశ, డైనమిక్ ​బ్యూరో : అందరి సహకారంతో విజయవాడ ఉత్సవ్ కార్యమాన్ని నిర్వహిస్తాము.. అందులో ఎలాంటి మార్పు లేదని విజయవాడ ఉత్సవ్, సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ సభ్యులు కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తెలిపారు. ఆ స్థలం బదులు వేరే చోట ఈ ఎక్స్పో ను నిర్వహించేందుకు స్థలం చూస్తున్నామని అన్నారు. ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ ఈ నెల 22 నుంచి అక్టోబర్ 2 వరకూ విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు అంగరంగవైభవంగా నిర్వహిస్తారని తెలిపారు. ఈ ఏడాది దసరా ఉత్సవాలకు మరింత వైభవాన్ని పెంచే విధంగా విజయవాడ ఉత్సవ్ నిర్వహణకు ప్రణాళిక చేశామని అన్నారు. అయితే గొల్లపూడి ఎక్స్పో కు సంబంధించిన భూమి విషయంలో హైకోర్టు స్టే ఇచ్చింది. అందుకే ఆ స్థ లం బదులు వేరే చోట ఈ ఎక్స్పో ను నిర్వహించేందుకు స్థలం చూస్తున్నాం అన్నారు. గత ప్రభుత్వంలాగా మా కూటమి పాలన ఉండదు.. ఏదైనా చట్టపరంగా వెళ్తాం అన్నారు. అందుకే గొల్లపూడిలో భూమికు సంబంధించి స్టే రాగానే అక్కడ పనులు ఆపేశామని ఆయన తెలిపారు. గొల్లపూడి లోనే వేరే చోట మరో స్థలం చూసి ఈ ఎక్స్పో ఏర్పాటు చేస్తామని అన్నారు. గత ప్రభుత్వంలోనే దేవాలయాలను, విగ్రహాలను, రథాలను ధ్వసం చేశారు.. అప్పుడు మాట్లాడని వారు ఇపుడు మాట్లాడుతున్నారని ఆరోపించారు.

Next Story