- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మండలి ఛైర్మన్ మోషేన్ రాజుకు అవమానం.. వైసీపీ వాకౌట్
by Vemula.Srinu Prasad |
శాసన మండలిలో గందరగోళం నెలకొంది..

X
దిశ, వెబ్ డెస్క్: శాసన మండలి(Legislative Council)లో గందరగోళం నెలకొంది. మండలి ఛైర్మన్ మోషేన్ రాజుని కూటమి ప్రభుత్వం అవమానించిందంటూ వైసీపీ సభ్యులు నిరసన వ్యక్తం చేశారు. ఛైర్మన్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గురువారం అసెంబ్లీలో భవనాలను ప్రారంభించారని, స్పీకర్, మంత్రులు ఉండి కూడా మండలి ఛైర్మన్‌ను ఆహ్వానించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతిలో మహిళా సదస్సు జరిగిందని, దీనికి కూడా ఛైర్మన్‌ను ఆహ్వానించలేదన్నారు. మండలి ఛైర్మన్‌కి జరిగిన అవమానంపై సీఎం సమాధానం చెప్పాలని ఎమ్మెల్సీ బొత్స డిమాండ్ చేశారు. ఛైర్మన్‌కు జరిగిన అవమానానికి నిరసనగా వైసీపీ సభ్యులు వాకౌట్ చేశారు.
Next Story






