ఆలూరులో టెన్షన్ వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-08-16 15:25:44  IST  )

కర్నూలు జిల్లా ఆలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది..

ఆలూరులో టెన్షన్ వాతావరణం.. భారీగా పోలీసుల మోహరింపు
X

దిశ, వెబ్ డెస్క్: కర్నూలు జిల్లా(Kuranool District) ఆలూరులో టెన్షన్ వాతావరణం నెలకొంది. తెలుగుదేశం పార్టీ(Telugu Desam Party)లోనే వర్గవిభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. స్థానిక టీడీపీ నేతలు వైకుంఠంజ్యోతి, వీరభద్రగౌడ్ వర్గాల మధ్య కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన అన్నదాత సుఖీభవ పథకం(Annadata SuChibhava) చిచ్చు పెట్టింది. అన్నదాత సుఖీభవకు సంఘీభావంగా ర్యాలీ నిర్వహించిన నేతలు బలప్రదర్శనకు దిగారు. నేతల జెండాల ఏర్పాటుపై ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. దీంతో వైకుంఠంజ్యోతి,వీరభద్రగౌడ్ వర్గాల పోటాపోటీ నినాదాలు చేశారు. అలూరు అంబేద్కర్ సర్కిల్‌లో ఇరు వర్గాలు పోటా పోటీ సమావేశాలు నిర్వహించారు. దీంతో పోలీసులు భారీగా మోహరించారు. పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఎవరూ కూడా వెనక్కి తగ్గడం లేదని తెలిసింది. ఈ నేపథ్యంలో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. ఎలాంటి ఉద్రిక్త ఘటనలు చోటు చేసుకోకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ పరిణామం అలూరు టీడీపీలో అసలు ఏం జరుగుతుందోననే అనుమానాలు కలుగుతున్నాయి. ఈ విషయం ఇప్పటికే పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. మరి ఎలాంటి చర్యలు ఉండబోతున్నాయో చూడాలి.

Next Story