ఏపీ భవన్‌ను పేల్చివేస్తామంటూ మెయిల్.. అప్రమత్తమైన పోలీసులు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-03 05:03:51  IST  )

ఢిల్లీలోని ఏపీ భవన్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది...

ఏపీ భవన్‌ను పేల్చివేస్తామంటూ మెయిల్.. అప్రమత్తమైన పోలీసులు
X

దిశ, వెబ్ డెస్క్: ఢిల్లీ(Delhi)లోని ఏపీ భవన్‌(AP Bhavan)లో టెన్షన్ వాతావరణం నెలకొంది. భవన్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఏపీ భవన్‌లో డాగ్ స్క్వాడ్‌(Dog Squad)తో తనిఖీలు చేయించారు. బాంబు ఆనవాళ్లు కనిపించలేదు. దీంతో అధికారులు, పోలీసుల ఊపిరి పీల్చుకున్నారు. ఫేక్ బెదిరింపు మెయిల్‌గా గుర్తించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఫేక్ మెయిల్(Fake mail) పంపిన వాళ్లు ఎవరనే కోణంలో విచారిస్తున్నారు.

అయితే ఈ ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కేంద్రంలోని సీనియర్ ఉన్నఅధికారుల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్‌లో రాత్రి 8.30కి ‘పూలే’ సినిమాను ప్రదర్శించారు. ఈ సమయంలో ఏపీ భవన్‌కు బెదిరింపు మెయిల్ వచ్చింది. పహల్గాం ఘటన తర్వాత ఢిల్లీలో పటిష్ట భద్రత ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో పార్లమెంట్, ఇండియా గేటుకు దగ్గరగా ఉన్న ఏపీ భవన్‌కు మెయిల్ రావడంతో భయాందోళనకు గురయ్యారు. డాగ్ స్క్వాడ్‌‌తో తనిఖీలు చేయడంతో ఏమీ లేదని తేలింది.

Next Story