Breaking: కింజరాపు అప్పన్న కిడ్నాప్..?

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-01 09:27:57  IST  )

శ్రీకాకుళం జిల్లానిమ్మాడలో కింజరాపు అప్పన్నను ఇద్దరు దుండగులు కిడ్నాప్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది..

Breaking: కింజరాపు అప్పన్న కిడ్నాప్..?
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లా(Srikakulam District) నిమ్మాడ(Nimmada)లో కింజరాపు అప్పన్న(Kinjarapu Appanna)ను కిడ్నాప్ చేసినట్లు తెలుస్తోంది. ఈ రోజు ఉదయం ఇంట్లో ఉన్న అప్పన్నను ఇద్దరు దుండగులు బైక్‌పై తీసుకెళ్లారని భార్య చెబుతున్నారు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్(MLC Duvvada Srinivas)పై దాడి జరగబోతోందని దివ్వెల మాధురి(Divvela Madhuri)కి ఇటీవల అప్పన్న తెలిపారు. దువ్వాడ శ్రీనివాస్‌పై దాడి చేస్తామని తనతో ధర్మాన కృష్ణదాస్ చెప్పినట్లు అప్పన్న చెప్పారు. ఈ ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అప్పన్న అదృశ్యం కావడం చర్చనీయాంశమైంది.

అప్పన్నఎక్కడ..?

అయితే ‘అప్పన్నను బైక్‌పై తీసుకెళ్లింది ఎవరు..?. ఎక్కడికి తీసుకెళ్లారు?. అప్పన్నకు అపాయం తలపెట్టారా.?, ప్రస్తుతం అప్పన్న పరిస్థితి ఏంటి.’ అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Next Story