శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్

by Vemula.Srinu Prasad |

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది...

శ్రీశైలం ఘాట్ రోడ్డులో భారీగా ట్రాఫిక్ జామ్
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం(Srisailam) ఘాట్ రోడ్డు(Ghat Road)లో భారీగా ట్రాఫిక్ జామ్(Traffic Jam) అయింది. లారీ ఆగిపోవడంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మార్కాపురం జిల్లా దోర్నాల మండలం శ్రీశైలం ఘాట్‌ రోడ్డులోని చింతల సమీపంలో లారీ(Lorry) రిపేర్‌కు గురైంది. దీంతో రోడ్డుపై నిలిపోయింది.అయితే లారీ మరమ్మతులు అయ్యే వరకూ దోర్నాల నుంచి శ్రీశైలం రోడ్డుపై ఇతర వాహన రాకపోకలు స్తంభించిపోయాయి. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థాలాన్ని పరిశీలించారు. క్రేన్ సాయంతో లారీని పక్కకు తీశారు. ట్రాఫిక్ జామ్‌ను క్లియర్ చేశారు. దీంతో వాహనదారులు ఊపిరిపీల్చుకున్నారు.

Next Story