జనసేనలోకి వైసీపీ కీలక నేతలు

by Vemula.Srinu Prasad |

జనసేన పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పేడాడ పంచాయతీకి చెందిన కీలక నేతలు వైసీపీని వీడి జనసేన పార్టీలో చేరారు...

జనసేనలోకి వైసీపీ కీలక నేతలు
X

దిశ, వెబ్ డెస్క్: జనసేన పార్టీ(Janasena Party)లోకి భారీగా చేరికలు జరిగాయి. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పేడాడ పంచాయతీ(Pedada Panchayat)కి చెందిన కీలక నేతలు వైసీపీ(Ycp)ని వీడి జనసేన(Janasena) పార్టీలో చేరారు. మాజీ సర్పంచ్ మెండి జగదీశ్వరరావు, వైస్ సర్పంచ్ మెండి సురేష్ జనసేన తీర్థం పుచ్చుకున్నారు. జనసేన సీనియర్ నాయకుడు లోకం ప్రసాద్ వీరికి పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్(Deputy CM Pawan) ఆశయాలకు ఆకర్షితులై నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగ మాధవి(Nellimarla MLA Lokam Naga Madhavi) పరిపాలన దక్షతపై నమ్మకంతో వైఎస్ఆర్సీపీ పార్టీ(Ysrcp) నుంచి జనసేనలోకి చేరినట్లు కొత్త చేరినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనసేన బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.

Next Story