Ap: విద్యుత్ ఛార్జీలపై మంత్రి కీలక ప్రకటన

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు పెంచుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది...

Ap: విద్యుత్ ఛార్జీలపై మంత్రి కీలక ప్రకటన
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీలు(Current Bill) పెంచుతున్నట్లు కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది. దీంతో గృహ వినియోదారులు(House Holders) ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే ఇళ్లకు వస్తున్న కరెంట్ బిల్లులు తడిచి మోపెడు అవుతున్నాయని, ఇప్పుడు మరోసారి ధరలు పెంచితే డబ్బులు ఎక్కడి నుంచి కట్టాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మంత్రి గొట్టిపాటి రవి కుమార్(Minister Gottipati Ravi Kumar) స్పందించారు. కరెంట్ ఛార్జీల పెంపుపై మంత్రి కీలక ప్రకటన చేశారు. కొందరు కావాలనే యాక్సిస్ గ్రూప్ ఫీల్డ్ ఎనర్జీ(Axis Group Field Energy) మీద అసత్య ప్రచారాలు చేస్తున్నారని, పదే పదే తమ ప్రభుత్వంపై బురదచల్లుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీలు పెంచలేదని, మున్ముందు పెంచబోమని ఆయన స్పష్టం చేశారు. ప్రజలకు నాణ్యమైన విద్యుత్‌ను అందించేందుకు తాము ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో రెనేబుల్ ఎనర్జీకి పెద్దపీట వేశామని, రూ.4.60 పైసలకు పీక్ అవర్స్‌లోనూ విద్యుత్ సరఫరా చేసేలా ఒప్పందం చేసుకున్నామని మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు.

Next Story