Petrol: పెట్రోల్, డీజిల్ కోసం టెన్షన్ వద్దు.. సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి

by Thanuru Gopichand |   (  Updated:2025-05-09 07:00:41  IST  )

భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో.. ప్రజల్లో కొంత ఆందోళన, కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి

Petrol: పెట్రోల్, డీజిల్ కోసం టెన్షన్ వద్దు.. సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయి
X

దిశ, డైనమిక్ బ్యూరో : భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్త వాతావరణం నెలకొన్న ఈ సమయంలో.. ప్రజల్లో కొంత ఆందోళన, కొన్ని అపోహలు నెలకొని ఉన్నాయి. వాటిని కేంద్ర ప్రభుత్వం వెనువెంటనే నివృత్తి చేస్తుంది. ఈ క్రమంలో భారత్-పాక్ మధ్య హైటెన్షన్.. నెలకొన్న సందర్భంలో ఇండియన్ ఆయిల్ సంస్థ కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా తగినంత ఇంధన నిల్వలు ఉన్నాయని వెల్లడించింది. ఇంధన సరఫరాలో కూడా ఎటువంటి ఆటంకాలు లేవని ఓ ప్రకటనలో పేర్కొంది. యుద్ధ భయంతో ప్రజలు పెట్రోల్ బంకులు, గ్యాస్ డీలర్ల వద్దకు పెద్ద ఎత్తున వెళ్లాల్సిన అవసరం లేదని ఇండియన్ ఆయిల్ సంస్థ ప్రకటన. ప్రజలు గమనించాల్సిందిగా ఈ ప్రకటనలో సూచించింది.

Next Story