జనసేనలో కోవర్టులు ఉన్నారు.. Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 22 |
జనసేనలో కోవర్టులు ఉన్నారు.. Pawan Kalyan సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: జనసేన పార్టీలో ఒకరిద్దరు కోవర్టులు ఉన్నారని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు తనను వెనక్కిలాగే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో ఉంటూ ఏ ఒక్కరు తప్పు చేసినా వారిని సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. గతంలో కేసీఆర్ తెలంగాణ ఇస్తే టీఆర్‌ఎస్‌ను కాంగ్రెస్‌లో కలిపేస్తానని చెప్పారని గుర్తుచేశారు. ఆ తరువాత ఆయన మనసు మార్చుకోవడం అది వారి వ్యూహమన్నారు. అలాగే జనసేన పార్టీలో కూడా తమ వ్యూహాలు తమకు ఉంటాయని తెలిపారు. పాదయాత్ర చేసిన నాయకుల్లో ఆంధ్రా దాసోస్‌గా మారిన వాళ్లూ ఉన్నారని పవన్ అన్నారు.

ఇవి కూడా చ‌ద‌వండి :

వైసీపీకి బిగ్ షాక్.. టీడీపీ కచ్చితంగా గెలిచే స్థానాలు ఎన్నంటే?


Next Story

Most Viewed