బహిర్భూమికి వెళ్లిన మహిళ కిడ్నాప్.. బావిలో డెడ్ బాడీ

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-05-18 09:24:50  IST  )

బహిర్బూమికి వెళ్లిన మహిళను కిడ్నాప్ చేసి ఆపై హత్య చేసి బావిలో డెడ్ బాడీని పడేశారు...

బహిర్భూమికి వెళ్లిన మహిళ కిడ్నాప్.. బావిలో డెడ్ బాడీ
X

దిశ, వెబ్ డెస్క్: బహిర్బూమికి వెళ్లిన మహిళ(Women)ను కిడ్నాప్(Kidnap) చేసి ఆపై హత్య చేసి బావిలో డెడ్ బాడీని పడేశారు. ఈ దారుణం విజయనగరం(Vizianagaram) జిల్లా శృంగవరపు మండలం వెంకటరమణపేట(Venkataramanpet)లో జరిగింది. గత రాత్రి గ్రామానికి చెందిన వెంకటలక్ష్మి తన కుమార్తెతో కలిసి బహిర్భూమికి వెళ్లారు. అయితే ఇద్దరు దుండగులు ఆటలో వచ్చి వెంకటలక్ష్మిని కిడ్నాప్ చేశారు. దీంతో జరిగిన విషయాన్ని కుటుంబ సభ్యులకు కుమార్తె చెప్పడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అయితే ఈ రోజు గ్రామ శివారులోని బావిలో వెంకటలక్ష్మి మృతదేహం లభ్యమైంది. గొంతు కోసి రాళ్లు కట్టి బావిలో పడేశారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వెంకటలక్ష్మి హత్య విషయం వెలుగులోకి వచ్చింది. ఈ మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. వెంకటలక్ష్మి మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులు కిడ్నాప్ చేసిన ప్రదేశంలో సీసీ పుటేజీలను పరిశీలిస్తున్నారు. త్వరలోనే కేసును ఛేదిస్తామని తెలిపారు. నిందితులను పట్టుకుని జైలుకు తరలిస్తామని పోలీసులు పేర్కొన్నారు.

Next Story