వారి తలరాతలు మారాలి.. : CM YS Jagan Mohan Reddy

by Sathputhe Rajesh |   (  Updated:2023-05-24 17:37:07  IST  )

ఏపీ సీఎం జగన్ కొవ్వూరులో విద్యాదీవెన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు.

వారి తలరాతలు మారాలి.. : CM YS Jagan Mohan Reddy
X

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ సీఎం జగన్ కొవ్వూరులో విద్యాదీవెన కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ప్రతి పేద కుటుంబం నుంచి ఒక డాక్టర్, ఒక కలెక్టర్ రావాలన్నారు. పేదరికం అనే సంకెళ్లను తెంచుకుని బయటపడాలన్నారు. దానికి చదువులు ఒక్కటే మార్గమని నమ్ముతూ నాలుగేళ్లుగా అడుగులు వేస్తున్నామన్నారు. అందులో భాగంగానే జగనన్న విద్యాదీవెన, వసతి దీవెన అమలు చేస్తున్నామన్నారు. 9.96 లక్షల మంది పిల్లలకు రూ.703 కోట్లు జమ చేసే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. వెనుకబడిన కుటుంబాల తలరాతలు మారాలన్నారు.

Next Story